TRENDING NOW

*


పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షు బాధ్యతలు స్వీకరించిన మల్లెల శివ నాగేశ్వరరావుకు ఘన సన్మానం చేసిన ప్రజా సంఘాలు మీడియా మిత్రులు*
 పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా మల్లెల శివ నాగేశ్వరావు నియమితులైన సందర్భంగా మల్లెల న్యూస్ పలనాడు జిల్లా ఇన్చార్జి నాగండ్ల వెంకట్రావు మరియు చిలకలూరిపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్చార్జి చప్పిడి బాలస్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో స్థానిక కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ కార్యాలయం నందు ఘనంగా సన్మానించడం జరిగింది . ఈ సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఐక్యవేదిక చైర్మన్ బి శ్రీను నాయక్ బి చిన్న నాయక్ జాను న్యూస్ సలికినీడి నాగరాజు డి గోపి నాయక్ ఎం వెంకటేష్ నాయక్ పి శ్రీనివాసరావు డి వెంకట్ పి వెంకట్ బుల్లోడు కే వాసు గూడూరు సుబ్బు ఎం వంశీ ఎన్ వెంకటేష్ తదితర ప్రజా సంఘ నాయకులు మీడియా మిత్రులు అందరూ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరావును శాలవతో పూలదండలతో ఘనంగా సన్మానించడం జరిగింది.






*జర్నలిజమా...! నీ దారెటు?*

*బజారున పడుతున్న నాలుగో స్తంభం ప్రతిష్ట*

*జర్నలిస్టు కావాలి అనుకునే వారికి కనీస విద్యార్హత లేకపోవడం బాధాకరం*

*నిరక్షరాస్యులైనా, వ్రేలి ముద్ర పరిజ్ఞానమైనా టార్గెట్లు పూర్తి చేస్తే చాలు*

*రిపోర్టర్ ఉద్యోగం క్షణాల్లో వచ్చేస్తుంది*

*ఇది పలు యాజమాన్యాల తీరు*

*ఫలితంగా ప్రజల్లో జర్నలిజం అంటేనే నవ్వుల పాలవుతున్న వైనం*

*ఈ పరిస్థితుల్లో కనీస విద్యార్హత నిర్దేశించి అటువంటి వారికే అక్రిడేషన్లు మంజూరు చేసేలా జీవో జారీ చేయాలి*

సమాజాభివృద్ధికి బాటలు వేసే మీడియా విలువలు రాను రాను మరింత దిగజారిపోతున్నాయి. గౌరవప్రదమైన వృత్తిగా, సమాజాన్ని ప్రభావితం చేసే  జర్నలిజం దారెటు అనేది అర్థం కావడం లేదు. జర్నలిస్ట్ కావాలి అనుకునే వారికి కనీస విద్యార్హత నిర్దేశించకపోవడం, టార్గెట్లు పూర్తి చేస్తే సక్సెస్ ఫుల్  జర్నలిస్ట్ గా యాజమాన్యాలు రెడ్ కార్పెట్ వేయటం సమాజానికి మూల స్తంభంగా పిలువబడే మీడియా పరువు ప్రజల్లో నవ్వుల పాలవుతోంది. 

సమాజాభివృద్ధిలో ప్రధానంగా నాలుగు స్తంభాలను నిర్ణయించారు. మొదటిది శాసనమండలి, రెండవది కార్యనిర్వహక, మూడవది న్యాయవ్యవస్థ, నాలుగవది మీడియా గా పేర్కొనడం జరిగింది. సమాజానికి మూల స్తంభం (ఫోర్త్ ఎస్టేట్) అని కూడా మీడియాను అభివర్ణిస్తారు. మొదటి మూడు వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోయినప్పటికీ వాటిని సక్రమమైన మార్గంలో నడిపించే వ్యవస్థగా మీడియాను మూలస్తంభంగా అభివర్ణించారు. అంతటి ప్రాధాన్యత ఉన్న మీడియా వ్యవస్థ జర్నలిజం నేడు ప్రక్క దారి పడుతోంది. పట్టింది. మూల స్తంభం పటిష్టంగా ఉండి మిగిలిన వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన బాధ్యత కలిగిన నాలుగో స్తంభం కునారిల్లుతోంది. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. ప్రధానంగా జర్నలిస్టు కావాలి అనుకునే వారికి ఒక విద్యార్హత లేకపోవడం ఒక కారణమైతే, రాజకీయం అనే చట్రం క్రింద మీడియా స్వేచ్ఛ బందీ కావటం మరో కారణం. పోలీస్ రికార్డుల్లో కేసులు నమోదయి ఉన్నవారిని సైతం జర్నలిస్టుగా పలు యాజమాన్యాలు ఉద్యోగాలు ఇవ్వటం ఫలితంగా మీడియా పరువు బజారున పడటం ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. 

*నేను జర్నలిస్ట్ కావాలి విద్యార్హత ఏమిటి?*

ఇక ఎవరైనా వచ్చి నేను జర్నలిస్టు కావాలి. విద్యార్హత ఏమిటి అని అడిగితే సమాధానం దొరకదు. ఎందుకంటే జర్నలిస్టు కావాలి అనుకునే వారికి ప్రభుత్వం కానీ, మీడియా యాజమాన్యాలు కానీ కనీస విద్యార్హతను ఇంతవరకు నిర్దేశించలేదు. దీని వలన ఓనమాలు రాని వారికి, టెన్త్ ఫెయిల్ అయిన వారికి సైతం పలు మీడియా యాజమాన్యాలు అందిన కాడికి పుచ్చుకొని ఐడి కార్డులు ఇచ్చేసి సమాజం మీదకు పంపుతున్నాయి. ఇదే అదునుగా చేసుకుని వార్త అంటే తెలియని వారు, అక్షరం ముక్క రాయటం రానివారు సామాజిక స్పృహ మచ్చుకైనా లేని వారు సైతం బెదిరించటం, ఎజెండాగా చేసుకుని జర్నలిస్టుగా రాణిస్తున్నారు. జర్నలిజం పరువును బజారున పడేస్తున్నారు. ఇప్పటికే పడేశారు. గౌరవమైన వృత్తిగా సమాజానికి మూలస్తంభంగా పిలువబడే మీడియా వీరి అరాచకాలు దాటికి కృంగిపోతోంది. బయటకు వెళ్తే చాలు జేబులో ఉన్న ఐడీ కార్డు చూపించి, సామాన్యులు మొదలుకొని వ్యాపారుల వరకు బెదిరించటం, స్వీయ లబ్ది పొందటం పరమావధిగా మారుతుంది. ఇదంతా యాజమాన్యాలకు తెలియదా అంటే పొరపాటే. వారు అడిగినటువంటి సంవత్సరం చందాలు, ప్రకటనలు చేస్తే మీ ఇష్టం అన్న చందంగా స్వేచ్ఛ ను ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పత్రికా స్వేచ్ఛ స్థానంలో బెదిరించే స్వేచ్ఛ చేరిందని చెప్పటంలో ఏ సందేహం లేదు. అడిగినన్ని డబ్బులు చెల్లిస్తే సన్మానాలు చేసి మరి కేసులు ఉన్నవారి కి సైతం రిపోర్టర్ గా ఐడి కార్డు , అక్రిడిటేషన్ సైతం ఇచ్చేస్తూ, స్వలాభాన్ని పొందుతున్నారు. దీనిని క్యాష్ చేసుకుంటూ బడ్డీ కొట్లు, మాంసం, చేపల మార్కెట్లు, ఇతర స్టాల్స్, రేషన్ మిల్లులు, నూనె దుకాణాలు  వద్ద ఆయా కార్డులు చూపుతూ, బెదిరింపులకు తెరలేపుతున్న దుస్థితి నెలకొంది. అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చి వార్తలు ప్రచురించి వాటి పరిష్కారానికి మార్గం చూపితే ఎవరూ కాదనరు. కానీ ఐడీ కార్డు చూపి బ్లాక్ మెయిలింగ్ కు దిగటం వృత్తిని నవ్వుల పాలు చేయడంతో పాటు మిగిలిన జర్నలిస్టులకు  కూడా ఆ మరకలను అంటించిన వారవుతున్నారు.   దీనిని చూసి జర్నలిస్టులు అందరూ ఇంతే ఉంటారు అనుకుంటా అంటూ సామాన్యులు ముక్కున వేలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. దీని ప్రభావం మిగిలిన జర్నలిస్టులపై కూడా పడటం నిజంగా బాధాకరం.

"*కనీస విద్యార్హత ఉంటేనే అక్రిడేషన్ ఈ నిబంధన తెస్తేనే కొంతైనా మార్పు.!*

స్లీపర్ ఉద్యోగానికి సైతం ఏడవ తరగతి లేదా పదో తరగతి విద్యార్హతను నిర్దేశిస్తున్నారు. కానీ పవిత్రమైన వృత్తిగా భావించే సమాజాన్ని ప్రభావితం చేస్తూ, అనేక సమస్యల పరిష్కారానికి నాంది పలికే జర్నలిస్టు ఉద్యోగానికి విద్యార్హత నిర్దేశించలేదు. ఇకనైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. నారా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ఉంటూ, ఈ శాఖలో అనేక విప్లవాత్మక మార్పులు సమూలంగా తీసుకువస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదే కోణంలో మండల స్థాయి విలేఖరికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్, జిల్లా స్థాయి విలేఖరికి డిగ్రీ నిర్దేశిస్తూ జీవో తీసుకురావాలి. అలా విద్యార్హత ఉంటేనే అక్రిడేషన్ ఇచ్చేలా నిబంధన రూపొందించాలి. ఈ నిబంధన పాటించకుండా కనీస విద్యార్హతలు లేని వారికి ఐడి కార్డ్ జారీ చేసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. దీనివలన సమాజంలో జర్నలిజానికి విలువ పెరగటంతో పాటు స్క్రాప్ బ్యాచ్ కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది.




సోషల్ మీడియా పోస్టులకు ఇకపై శిక్షలు ఉండవు... కేంద్ర ప్రభుత్వం
 
సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు ఎటువంటి శిక్షలు ఉండవని కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జీవో ఇవ్వడం వాటిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించడం ఎంతో హర్షించదగ్గ విషయం సదరు విషయంపై కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు తీసుకున్న సాహసంసోపేత నిర్ణయానికి అభినందనలు తెలియజేస్తున్న మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ 

సోషల్ మీడియా పోస్టులపై ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచన.

సోషల్ మీడియా పోస్టుల మీద ఇకపై కేసులు నమోదు చేయొద్దని ఆదేశం.

ఆ పోస్టుల ఆధారంగా శిక్షలు కూడా వేయొద్దన్న కేంద్రం.
సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.





అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి..

*ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..*

👉అధికారులరా..!! పోలీసులారా..!!
తోటి విలేకరులారా..!!తెలుసుకొండి..

👉అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..? వారు సంపాదకులు కారా..?

👉అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు
చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి, కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా..?

👉 అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను‌ భంగం కలిగించడమే అవుతుంది.

👉ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైన, సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు.

ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం.. ఇది తెలుసా..?

👉అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి..? INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా…?

👉PRINT MEDIA, ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా..? ఆయా జిల్లా కలెక్టర్లు, DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు..?

👉నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టు కుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…?

👉రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు.

👉అక్రిడేషన్ కొలమానం కాదు. అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే..

👉మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? వారికి లేని బాధ మీకెందుకు…?

👉అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో, సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి.

🙏అయా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి.

👉ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు..?గమనించండి.

👉 ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా…?

👉ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం, వార్తలో సత్తా ఉండాలి.. ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి… కత్తిలా మార్చండి.

👉 జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలనుకునే వారికి.. అక్రిడేషన్ కార్డు జీవితం కాదు, జాబ్ కార్డ్ కాదు.

మీరు రాబట్టిన సమాచారాన్ని, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే..

అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా.. లేకపోతే మీకు అందదా.. అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి.. ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి..

*జై జర్నలిజం.. జై జై జర్నలిజం..*


              



డబ్బుల్లేక... టీవీ9 జర్నలిస్టు కుటుంబ కన్నీటిగాథ 

జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు. భరోసా..భద్రతలేని ఉద్యోగాలు.భార్యల మీద ఈసమెత్తు బంగారం ఉండదు.అద్దె ఇల్లు..చనిపోతే శవాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని దుస్థితి.సిరిసిల్ల టీవీ9 రిపోర్టర్ ప్రసాద్‌ శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.ఆయన కుటుంబ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది.ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఒక బాబు.వీరి భవిష్యత్‌ ఏంటో ఆలోచిస్తేనే బాధనిపిస్తుంది.సొంత ఇల్లులేదు.సొంత ఊళ్లో జాగలేదు. సిరిసిల్లలో అద్దె ఇంట్లో జీవనం సాగించిన ఆయన శవం బంధువుల ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వాహించాల్సిన పరిస్థితి.కొడుకు మృతదేహం వద్ద తల్లి రోదిస్తూ ‘కొడుకా ఒక్క రూపాయి సంపాదించుకోలేదు.పూల దండలు సంపాదించుకుంటున్నవారా? కొడుకా..నీ పిల్లల బతుకు ఏం కావాలిరా..మాకు అగ్గి పెడుతావనుకుంటే..మేం నీకు అగ్గిపెట్టాల్సి వస్తుంది కొడుకా..’ అంటూ ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయింది.జర్నలిస్టు మిత్రులు వృత్తిపరంగా ఒత్తిడికి గురవుతున్నారు.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.  దిక్కుతోచక తనువు చాలిస్తున్నారు. నెలవారీ జీతంలేని జర్నలిస్టులు ఆలోచించాలి.ఇతర ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లోకి మారిపోవాలి . భార్యాపిల్లల్ని కాపాడుకోవాలి.



కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చీరాల టౌన్ ప్రెసిడెంట్ గా నియమితులైన కారుమంచి వీరాంజనేయులు
 ఈరోజు చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షైక్ రఫానీ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న కారుమంచి వీరాంజనేయులు ఈ నియామక పత్రం అందించిన వారిలో లోకసత్త పార్టీ ఇంచార్జి భానుప్రసాద్ రాధ రంగా మిత్ర మండలి కన్వీనర్ అచ్చుకోల మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

మల్లెల  న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లా చీరాల మీడియా ఇంచార్జ్  కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  అభ్యున్నతికి... పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  బాపట్ల జిల్లా చీరాల పట్టణ ప్రెసిడెంట్ కారుమంచి   వీరాంజనేయులు తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నియామక పత్రం అందుకున్న   కారుమంచి వీరాంజనేయులు  తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన చీరాల నియోజకవర్గం అసోసియేషన్ నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని విలేకరుల అభివృద్ధి కోసం చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్   హక్కుల సాధన కోసం జాతీయ కమిటీ వారు తీసుకునే అన్ని , నిర్ణయాలను తూచా తప్పకుండా బాపట్ల జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు




మహాన్యూస్ ఆఫీసు‍పై దాడిని ఖండించిన కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు 

ఆఫీసుపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం.

బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన సరైనది కాదు.

దానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా రాజకీయ నాయకులైన ఉపేక్షించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

కథనాలు ప్రసారాలు పట్ల అభ్యంతరాలు ఉంటే  బ్రాడ్ కాస్టింగ్ కు ఫిర్యాదు చేయవచ్చు

మహాన్యూస్ యాజమాన్యంకు, సిబ్బందికి  సంఘీభావం తెలియజేసిన మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిటీ అసోసియేషన్