జర్నలిస్ట్ ఇంటి పై దాడికి తెగబడిన ఎలక్ట్రికల్ సిబ్బంది.!
బయటకు రా..తేల్చుకుందామంటున్న ఎలక్ట్రికల్ సిబ్బంది!
భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు.
జర్నలిస్టులకు భద్రత ఎక్కడ..
ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహిస్తుంటారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా జరిగిన విషయాన్ని తెలియజేయకపోతే నిరంకుశ రాజ్యంగా మారే ప్రమాదం ఉంది. అయితే అనేక ఒత్తిడుల మధ్య నేడు జర్నలిస్టులు తమ విధులను నిర్వహించాల్సి వస్తున్నది. జర్నలిస్టులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే! జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ విధంగా దాడికీ తెగబడటం సరైన పద్దతి కాదని..తీవ్రంగా ఖండిస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు నేషనల్ ప్రెసిడెంట్ కేసరి ఆక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్.
Post A Comment:
0 comments: