ఫిబ్రవరి 2026




పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి చిన్న పేపర్ల ఎడిటర్ల మనోవేదన

పల్నాడు జిల్లాలో అటెండెన్స్ తగ్గింది అంటూ అక్రిడెన్స్ లేదంటూ మాయాజాలం...

 గత సంవత్సర కాలం నుండి అటెండెన్స్ ఉన్నప్పటికీ అక్రిడేషన్ కు నోచుకోని పలు చిన్న పేపర్లు 

 డి పి ఆర్ ఓ ఆఫీస్ లో 30 రోజులు పేపర్ వేస్తున్నప్పటికీ 20 రోజులే అటెండెన్స్ పడుతున్న వైనం 

 కార్యాలయంలో పది రోజులు పేపరు మాయమవుతున్నట్లుగా తెలుస్తుంది..

 ఈ విషయంలో అధికారులకు పేపర్ తగ్గుతుందంటూ చెప్పినప్పటికీ పట్టించుకోని అధికారులు...

 అటెండెన్స్ లేని పేపర్లు కూడా అక్రిడేషన్ ఇస్తున్నట్లుగా సమాచారం...

 ఈ విషయమై అధికారులు తెలియజేస్తున్నప్పటికీ సెకండ్ లిస్ట్ అంటూ మాయాజాలం చేస్తున్నారు...

 చిన్న పేపర్లను పట్టించుకోని నరసరావుపేట డి పి ఆర్ ఓ కార్యాలయం...

 కార్యాలయంలో ఎడిటర్ లు వెళ్లి అధికారుల కోసం వేచి చూచినా కూడా పట్టించుకోని అధికారులు...





 అటెండెన్స్ ఉన్న చిన్న పేపర్లకు అక్రిడేషన్లు ఇవ్వాలని పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో దృష్టి సారించి అందరికి న్యాయం చేయాలని పలువురు ఎడిటర్ లు కోరుతున్నారు.




పల్నాడు జిల్లా

ఈ ఫైలింగ్ లేకుండా నెలవారి పేపర్ అటెండెన్స్ లేకుండా అక్రిడేషన్ లు మంజూరు 

 అసలు rna ఎప్పుడొచ్చింది ఈ ఫైలింగ్ ఉందా లేదా తెలుసుకున్నారా...

 పల్నాడు జిల్లాలో కొత్త ఆచారానికి ఆద్యం పోసిన డిపిఆర్ఓ కార్యాలయం

 రెండు సంవత్సరాలుగా  అటెండెన్స్ ఉన్న చిన్న పేపర్లకు అక్రిడేషన్లు మంజూరు చేయని అధికారులు 

 ఏమిటని ప్రశ్నిస్తే నాలుగు రోజుల పేపర్ తగ్గింది అంటూ సమాధానం చెబుతున్న వైనం 


 నాలుగు రోజులు పేపర్ తగ్గినప్పుడు మూడు నెలల పేపర్ ఒకేసారి తీసుకొని అక్రిడేషన్ ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న పలువురు ఎడిటర్లు...

 అసలు ఈ ఫైలింగ్ లేకుండా అక్రిడేషన్ లు ఎలా మంజూరు చేస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు...


 రెండు సంవత్సరాలుగా నెలకు 30 రోజులు పేపర్ వేస్తే 20 రోజులే అటెండెన్స్ వేసిన నరసరావుపేట పలనాడు జిల్లా డిపిఆర్ఓ కార్యాలయం

 అటు బాపట్లలో గుంటూరులో పల్నాడు జిల్లా ఎడిటర్లకు అన్యాయం జరిగిందంటూ మొత్తుకుంటుంటే చివరకు పల్నాడు జిల్లాలో కూడా అక్రిడేషన్లు రాకుండా చేసిన వైనం...


 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి  రెండు సంవత్సరాలగా పేపరు  డిపిఆర్ఓ కార్యాలయంలో ఇస్తున్నప్పటికీ అటెండెన్స్ నాలుగు రోజులు తగ్గింది అంటూ అక్రిడేషన్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం...


 20 రోజులు అటెండెన్స్ ఉన్నప్పుడు  మిగతా నాలుగు రోజుల పేపర్ కూడా అడిగితే ఇస్తారు కదా...


 ఫోన్ లెత్తి సమాధానం చెప్పరు ఆఫీస్ దగ్గరకెళ్ళి ఉదయం కూర్చొని సాయంత్రం దాక ఉన్న కూడా ఎడిటర్లను కలవరు...


 అక్రిడేషన్ మంజూరు కోసం ఆన్లైన్ చేసుకొని ఆఫీస్ చుట్టూ తిరిగి అప్రూవల్ కొట్టారా లేదా అని అడుగుతున్నా కూడా ఏ సమాధానం చెప్పకుండా నెల 15 రోజులు తిప్పుకున్న సందర్భాలు...

 కొడితే అప్రూవల్ అన్న కొట్టాలి లేదా సమాధానం అన్న అధికారులు తెలియజేయాలి... ఏది చెయ్యని సందర్భం....

 ప్రభుత్వం ఏదో చెప్పిందంటూ హడావుడిగా ఒక లిస్టు బయటకు వదిలేశారు...


 అటెండెన్స్ ఉన్నా కూడా అక్రిడేషన్ రాకపోవడంతో ఎడిటర్లు తలలు పట్టుకొని ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక...

 ఇప్పటికైనా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఎడిటర్లు కోరుతున్నారు...