May 2025

ఉమ్మడి గుంటూరు జిల్లా సాక్షి టీవీ ప్రతినిధి అశోక్ వర్ధన పై జరిగిన దాడిని ఖండిస్తున్న కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు 
 పల్నాడు జిల్లా కారంపూడి లో వైస్ ప్రెసిడెంట్ ఎంపీపీ ఎన్నికల కవరేజ్ కోసం వెళ్ళిన సీనియర్ జర్నలిస్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లా సాక్షి టీవీ ప్రతినిధి అశోక్ వర్ధన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్న కేసరి ఆక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు. ఇటువంటి దాడులకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని  ఈ సందర్భంగా తెలియజేసిన మల్లెల శివ నాగేశ్వరరావు.






 


జర్నలిస్టుల విధులు- ప్రధాన విధులు.


 జర్నలిస్టుల విధులు,అందులో ప్రధానమైన విధులు, బాధ్యతలు అనేవి ఈ సమాజంలో చాలా కీలకమైనవి.వారి ప్రధాన లక్ష్యం ప్రజలకు సరైన, నిష్పాక్షికమైన సమాచారాన్ని అందించడం.ఆ విధులు, 

ప్రధాన విధులు వివరణ.


వార్తల సేకరణ (Reporting)

   సంఘటనలు,పరిణామా లు,సమస్యలపై సమాచారాన్ని సేకరించడం.ఇందుకోసం వ్యక్తులతో ఇంటర్వ్యూలు చేయడం, ప్రదేశాలను సందర్శించడం, అధికారిక పత్రాలను పరిశీలించడం వంటివి చేస్తారు.


వార్తల రచన (Writing)

 సేకరించిన సమాచారాన్ని స్పష్టంగా, సంక్షిప్తంగా, ఆకర్షణీయంగా వార్తలు, కథనాలు, వ్యాసాల రూపంలో రాయడం.


ఎడిటింగ్ (Editing)

     వార్తల ఖచ్చితత్వాన్ని, స్పష్టతను, వ్యాకరణ లోపాలు లేకుండా చూసుకోవడం. వాస్తవాలను.


 ధృవీకరించడం.(Fact-checking) కూడా ఇందులో భాగం.


ప్రసారం/ప్రచురణ (Dissemination)

          వార్తలను పత్రికలు, టీవీ, రేడియో, ఆన్‌లైన్ మీడియా వంటి వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందించడం.


పరిశోధనాత్మక జర్నలిజం(Investigative Journalism)

        అవినీతి, అక్రమాలు, సామాజిక సమస్యల వెనుక ఉన్న నిజాలను లోతుగా పరిశోధించి వెలుగులోకి తీసుకురావడం.

ప్రధాన బాధ్యతలు.


 నిష్పాక్షికత మరియు నిబద్ధత (Objectivity and Impartiality)

        వార్తలను ఎటువంటి పక్షపాతం లేకుండా, నిజాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు అందించడం. వ్యక్తిగత అభిప్రాయాలను, సంస్థాగత ప్రయోజనాలను వార్తల్లో చొప్పించకుండా చూసుకోవడం.


ఖచ్చితత్వం(Accuracy)

  వార్తల్లోని ప్రతి వివరము, వాస్తవము నిజమైనవని నిర్ధారించుకోవడం.తప్పు సమాచారం ప్రజలకు చేరకుండా జాగ్రత్త వహించడం.


సామాజిక బాధ్యత (Social Responsibility)       

ప్రజలకు ఉపయోగపడే, సమాజానికి మేలు చేసే వార్తలను ప్రచురించడం. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేయడం.


నైతిక విలువలు (Ethical Values)      గోప్యతను గౌరవించడం, పరువు నష్టం కలిగించకుండా ఉండటం, సంచలనం కోసం నిరాధారమైన వార్తలను ప్రచురించకపోవడం వంటి నైతిక విలువలను పాటించడం.


ప్రజాస్వామ్యానికి రక్షణ (Safeguarding Democracy)


ప్రజలకు సరైన సమాచారం అందుబాటులో ఉంటేనే వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. జర్నలిస్టులు ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య వారధిగా, ప్రశ్నించే గొంతుకగా వ్యవహరిస్తారు.


 పారదర్శకత (Transparency)

   తమ వార్తా మూలాల ను, సమాచార సేకరణ పద్ధతులను వీలైనంత వరకు పారదర్శకంగా ఉంచడం.


భద్రత (Safety)

    క్లిష్ట పరిస్థితుల్లో,ప్రమాద కరమైన ప్రాంతాల్లో కూడా వార్తలు సేకరించే ధైర్యం కలిగి ఉండాలి. తమ భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.

అయితే, నేటి కాలంలో జర్నలిజం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. వ్యాపార ధోరణి, రాజకీయ ఒత్తిళ్లు, సోషల్ మీడియా ప్రభావం వంటివి జర్నలిస్టుల పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ, సమాజంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైనది, వారి బాధ్యతలు మరింత పెరిగాయి.






ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా నియమితులైన కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ పట్టణానికి చెందిన "కాపుజాతి" ముద్దుబిడ్డ ఆలపాటి సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ నుండి నేటి వరకు ఉన్న కాలంలో మొట్టమొదటి సారిగా " కాపు " సామాజిక వర్గానికి " ఏపీ ప్రెస్ అకాడమీ" ఛైర్మన్ పదవిని కేటాయించిన " కూటమి " ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసిన కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు 













మల్లెల  న్యూస్ ఛానల్ తెలంగాణ మీడియా ఇంచార్జ్  కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  అభ్యున్నతికి... పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  బైరపాక మహేష్  తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న   బైరపాక మహేష్  తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన స్టేషనఘన్పూర్ నియోజకవర్గం అసోసియేషన్ నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని విలేకరుల అభివృద్ధి కోసం చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్   హక్కుల సాధన కోసం జాతీయ కమిటీ వారు తీసుకునే అన్ని , నిర్ణయాలను తూచా తప్పకుండా జనగాన్ జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు