ఆగస్టు 2026





కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా శివ సాయి రామ్ నియామకం

చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా చిలకలూరిపేట మల్లెల న్యూస్ ఎడ్లపాడు మండల ఇన్‌చార్జి శివ సాయి రామ్ను నియమించారు.

అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు శివ సాయి రామ్‌ను చిలకలూరిపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అసోసియేషన్ తనకు అప్పగించిన బాధ్యతలను శివ సాయి రామ్ సమర్థవంతంగా నిర్వహిస్తూ, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

నియామకం పట్ల పలువురు పాత్రికేయులు, అసోసియేషన్ సభ్యులు శివ సాయి రామ్‌కు అభినందనలు తెలిపారు.





కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కాకేసరి ర్యదర్శిగా షేక్ జానీభాష నియామకం 

చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా చిలకలూరిపేట లోకల్ న్యూస్ నాదెండ్ల మండల ఇన్‌చార్జి షేక్ జానీభాషను నియమించారు.

అసోసియేషన్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా షేక్ జానీభాషకు పలువురు పాత్రికేయులు, అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.





కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా బాలు నాయక్ 

చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా వార్తా లోకం దినపత్రిక పల్నాడు జిల్లా ఇన్‌చార్జ్ బాలు నాయక్ ను నియమించిన జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు 

అసోసియేషన్‌లో ఆయనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలు నాయకులకు పలువురు పాత్రికేయులు, అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.







*కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ బాపట్ల జిల్లా మీడియా ఇన్ఛార్జి నియామకం*


కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ బాపట్ల జిల్లా మీడియా ఇంచార్జి గా కారుమంచి వీరాంజనేయులు గారిని నియమించటం జరిగింది. 

ఈ సందర్భంగాఏర్పాటు చేసిన సమావేశం లొ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు గారు, చప్పిడి బాలస్వామి గారు పల్నాడు జిల్లా మీడియా ఇంచార్జ్,మరియు కోవటి వాసు గారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ నియామక కార్యక్రమం లొ పాల్గొని కారుమంచి వీరాంజనేయులు గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. 
ఇందు నిమిత్తమై కేసరి యాక్టివ్ ప్రెస్ అసోసియేషన్ బాపట్ల జిల్లా మీడియా ఇంచార్జ్ కారుమంచి వీరాంజనేయులు గారు మాట్లాడుతూ ఈ సంఘఅభివృద్ధి కొరకు మరియు బాపట్ల జిల్లా నూతన సభ్యులకు తన వంతు కృషి చేస్తానని ఈ కార్యక్రమంలో తెలిపారు జాతీయ అధ్యక్షులు  మరియు మీడియా మిత్రులందరితో కలిసి పని చేస్తానని తెలియజేయడం జరిగింది. 
ఈ కార్యక్రమము చీరాల, పేరాల,పీపుల్స్ డయాగ్నొస్టిక్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది