కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా శివ సాయి రామ్ నియామకం
చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా చిలకలూరిపేట మల్లెల న్యూస్ ఎడ్లపాడు మండల ఇన్‌చార్జి శివ సాయి రామ్ను నియమించారు.
అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు శివ సాయి రామ్‌ను చిలకలూరిపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అసోసియేషన్ తనకు అప్పగించిన బాధ్యతలను శివ సాయి రామ్ సమర్థవంతంగా నిర్వహిస్తూ, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
నియామకం పట్ల పలువురు పాత్రికేయులు, అసోసియేషన్ సభ్యులు శివ సాయి రామ్‌కు అభినందనలు తెలిపారు.
Post A Comment:
0 comments: