జూన్ 2026





*జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు స్కూళ్లలో ఉచిత విద్య అమలుకు ఉత్తర్వులు*


అనంతపురం:అనంతపురం జల్లా లో జర్నలిస్టుల పీలల్లలకు ప్రయివేటు పాఠశాల లో ఉచిత విద్య అమలయ్యేలా కలెక్టర్ ఓ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఏపీయూడబ్ల్యూజే పోరాటాల ఫలితంగా కొన్నేళ్లుగా జిల్లా లో ఈ విధానం అమల్లో ఉంది. 2026-27 విద్యా సంవత్సరం లోను ఈ విధానాన్ని అమలు  చేయాలని ఇటీవలే ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్, కలెక్టర్ ఆనంద్ కు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి ని పరిగణలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం తాజా గా ఈ ఏడాది లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం పై కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల సూరి నాగేశ్వరరావు మరియు యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.




ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలి

ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రతి పత్రిక విలేకరి పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని, వారి పిల్లల విద్యకు ప్రైవేట్ విద్యాసంస్థలు సహకరించాలని ఆయన కోరారు.

మల్లెల శివ నాగేశ్వరరావు
జాతీయ అధ్యక్షులు
కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్