✅ వైద్య సహాయం: అత్యవసర వైద్యంలో సంఘం నుండి ఆర్థిక సాయం.


✅ మరణ భీమా: సభ్యుని మృతికి అనుబంధంగా కుటుంబానికి నష్ట పరిహారం (భీమా పాలసీ ద్వారా).


✅ శిక్షణ శిబిరాలు: జర్నలిజం నైపుణ్యాల పెంపుకోసం వర్క్‌షాప్‌లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్లు.


✅ వృద్ధాప్య పథకం: సీనియర్ జర్నలిస్టులకు ప్రత్యేక గౌరవ కార్యక్రమాలు.


✅ ఇదివరకు రిటైర్డ్ సభ్యుల గౌరవ వేదిక: వారిని గుర్తించేందుకు సభలు, అవార్డులు.


✅ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు విద్యా సహాయం: స్కాలర్‌షిప్‌లు లేదా ట్యూషన్ ఫీజు మద్దతు.


✅ జర్నలిస్టు భవన్ / ప్రెస్ క్లబ్ అభివృద్ధి: సమావేశాలకు, వేదిక ఏర్పాటు.



జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు, జర్నలిస్ట్ అంటే అక్షరాలను తూటాల్లా చేసుకుని, అవినీతి లొసుగులను బయటకులాగే వేటగాడు.. పొలంలో విత్తుని మొలకెత్తించడానికి రైతు తన శ్రమను ఎలా ధారపోస్తాడో, ఒక వార్తను సేకరించడానికి, విలేఖరి తన సర్వశక్తులూ ఉపయోగిస్తాడు.. అతనిది బ్రతుకు పోరాటం.. ఇతనిది మంచిని బ్రతికించాలనే ఆరాటం.. జర్నలిజం బ్రతుకు అక్షరాల వెంట పరిగెడుతుంది..జ‌ర్న‌లిస్టుల సంక్షేమం, హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ, మీడియా స్వేచ్చ త‌దిత‌ర అంశాల ప్ర‌తిపాదిక‌న కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ ప‌నిచేస్తోంది. 

1. వివిధ ప్రింట్‌,ఎల‌క్ట్రానిక్‌,సోష‌ల్ మీడియా మీడియా వేదిక‌ల్లో ప‌నిచేస్తూ స‌మాజ వికాసానికి పాటుప‌డే వారు ఎవ‌రైన ఈ అసోసియేష‌న్ లో స‌భ్యులుగా చేర‌వ‌చ్చు. 

2. తాము ప‌నిచేస్తున్న రంగంలో వృత్తి నేపుణ్యాలు పెంచ‌టానికి శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిష్ట్రాతులైన సీనియ‌ర్ల‌చే ఏర్పాటు చేస్తాం. 

3. జ‌ర్న‌లిస్టుగా ఉండ‌టంతో పాటు స‌మాజ సేవ‌లో కూడా జ‌ర్న‌లిస్టులు భాగ‌స్వాములు కావ‌డానికి అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అంద‌జేస్తాం. 

4.ప్రతి నియోజకవర్గంలో జర్నలిస్టు సంఘాలకు సంబంధం లేకుండా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో ' ప్రెస్ క్లబ్ ' లు ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తాం. 

5. మీడియాపై జ‌రుగుతున్న దాడుల‌ను ఎదుర్కొవ‌డానికి అవ‌స‌ర‌మైన న్యాయ స‌హాయాన్ని అసోసియేష‌న్ ద్వారా అంద‌జేయ‌ద‌లిచాం. 

6. స్థానికంగా ప్రెస్ క్ల‌బ్ ఏర్పాటు చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన స్థ‌ల సేక‌ర‌ణ కోసం, భ‌వ‌న నిర్మాణాల కోసం పూర్తి స‌హ‌కారం అంద‌జేస్తాం. 

7. జ‌ర్న‌లిస్టుల‌తో పాటు వారి కుటుంబాల‌కు ఆరోగ్య భీమా అందించ‌టం, అవ‌స‌ర‌మైన వారికి వైద్య స‌హాయానికి చేయూత అందించ‌టం 

8. నివేశ‌న స్థ‌లాల కోసం జ‌రిగే ఉద్య‌మాల్లో కేంద్ర క‌మిటీ స‌భ్యులు పాల్గొని, జ‌ర్న‌లిస్టుల‌కు నివేశ‌న స్థ‌లాలు, ఇళ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అంద‌జేస్తాం. 

9. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలలో ఉచితంగా లేదా కనీసం 50శాతం ఫీజు రాయితీ మంజూరు చేయాలని ప్రభుత్వంచే జీవో రూపొందించి, పక్కాగా అమలు చేపించడం

10. సంఘం తరఫున 'జర్నలిస్టుల సంక్షేమ నిధి' ఏర్పాటు చేయడం. తద్వారా జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం. వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు.

11. అకాల మరణం సంభవిస్తే మట్టి ఖర్చులకోసం రూ.10వేలు ఆర్థికసాయం

12. జర్నలిస్టులపై భౌతిక దాడులు, తప్పుడు కేసులపై సంఘం తరపున సహకారం అంద‌జేయ‌నున్నాం. 

----------------------



Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: