జర్నలిస్ట్ మిత్రులకు నమస్తే
జర్నలిస్టు సంఘాలు ఆలోచించాలి
అర్హత లేని అవగాహన లేని జర్నలిజం సమాజనికి చేటు తెస్తుoది. పత్రిక యాజమాన్యం డబ్బులు కోసం ప్రెస్ కార్డులు ఇవొద్దు. జిల్లా సమాచారం శాఖ అధికారులు పర్యవేక్షణ పెంచాలి.
ఇటీవల అక్రీడేషన్ కార్డుల జారీ పక్రియ మొదలు పెట్టడం తో రోజు కో పత్రిక పేరుతో జర్నలిస్టులు పుట్టుక వస్తున్నారు. కొత్త వారు ఉన్నారు పాత వారు ఉన్నారు. కనీసం జర్నలిస్ట్ అనే పదం విలువ తెలియని వారు కూడా జర్నలిస్టు అంటూ అవతారంఎత్తుతున్నారు. జర్నలిజం అంటే జనం అసహించుకొనే స్థాయి తెస్తున్నారు. ఆటో డ్రెవర్, హోటల్ లో క్లీనర్, సెల్ ఫోన్ రిపేర్ చేసే వాడు, పరిశ్రమలలో పని చేసే కార్మికుడు ప్రెస్ కార్డులు పెట్టు కొని జర్నలిస్టు అంటున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా పత్రిక పేరు చెప్పు కొని పబ్బం గడుపు కొనే పరిస్థితి నెలకొంది. నిత్యం ప్రజలను మోసం చేసే వాళ్ళు, ప్రభుత్వ అధికారులను మోసం చేసే వాళ్ళు దొంగ తనం చేసేవారు, నానా తప్పులు చేసే వాళ్ళు అనేక సందర్భాల్లో బ్లక్ మెయిల్ చేసే వాళ్ళు విలేకరి అంటూ చెలామణి అవుతున్నారు. వీరి పట్ల జర్నలిస్టు సంఘాలు అప్రమత్తత అవసరం. నిజాలను నిర్భయంగా ఖండిoచాలి. ఇటీవల ఓ నాయకుడు సిగ్గు ఎగ్గు లేని వాళ్ళు జర్నలిజం లోకి వచ్చి మీడియా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఊరుకుంటూ పోతే జర్నలిజం పూర్తిగా దూర్మార్గులకు అడ్డాగా మారుతుందని హెచ్చరించారు. వీళ్ళు సమాజంకు ఎమి సమాచారం చేరవేస్తారు. అనే ఆలోచనలు అందరిలో మెలుగుతూన్నాయి. పోలీస్ రికార్డులో కేసులు ఉన్నవారిని వెంటనే ప్రెస్ కార్డులు జారీ చేయటం మానుకోవాలి, ప్రెస్ యాజమాన్యాలకు జర్నలిస్ట్ సంఘాలు అక్రీడేషన్ కమిటీ లేఖలు రాయాలి. వృత్తి గౌరవం కాపాడాలని సూచించాలి. దొoగ తనం చేసే వాళ్ళకు ప్రతి రోజు సమాజం లో మోసాలకు పాల్పడుతున్నవారికి, డ్రెవర్స్, సెల్ ఫోన్ షాప్ రిపేర్స్ చేసే వాళ్ళకు ఫేక్ సర్టిఫికెట్ పెట్టి కార్డులు పొందూ వారిని సున్నం వేసే పెయింటర్ సైతం విలేకరి అంటూన్న వారినీ పూర్తిగా బహిష్కరణ చేసేలా ఉండాలి. జిల్లా కలెక్టర్ కు జర్నలిస్టు సంఘాలు తెలుపాలి. జెర్నలిజం ముసుగులో కొనసాగుతున్న నకిలీ విలేకరులను కొనసాగించవద్దు. పత్రిక యాజమాన్యం ఐదు వేలు పదివేలు ఇస్తే ప్రెస్ కార్డులు జారీ చేయకుండా చర్యలు చేపట్టాలి. ఐ అండ్ పిఆర్ కమిషనర్ లేఖలు రాయాలి. నిజమైయిన జర్నలిజంను బ్రతికించాలి. జర్నలిస్ట్ సంఘాలు అక్రీడేషన్ కమిటీ ఇందుకు కృషి చేయాలి.
Post A Comment:
0 comments: