అనంతపురం:అనంతపురం జల్లా లో జర్నలిస్టుల పీలల్లలకు ప్రయివేటు పాఠశాల లో ఉచిత విద్య అమలయ్యేలా కలెక్టర్ ఓ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీయూడబ్ల్యూజే పోరాటాల ఫలితంగా కొన్నేళ్లుగా జిల్లా లో ఈ విధానం అమల్లో ఉంది. 2026-27 విద్యా సంవత్సరం లోను ఈ విధానాన్ని అమలు చేయాలని ఇటీవలే ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్, కలెక్టర్ ఆనంద్ కు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి ని పరిగణలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం తాజా గా ఈ ఏడాది లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం పై కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల సూరి నాగేశ్వరరావు మరియు యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Post A Comment:
0 comments: